
కన్నడ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. KGF సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా హైప్ కొనసాగుతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్, ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు సంబంధించిన బోల్డ్ సీన్స్‌పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసి, వాటిని తొలగించాలని కోరినట్లు ప్రచారం జరిగింది.
ఈ వార్తలపై స్పందించిన కియారా..అవన్నీ పూర్తిగా నిరాధారమైన పుకార్లేనని స్పష్టం చేసింది. ‘టాక్సిక్ సినిమాలో నా పాత్ర, సీన్స్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. స్క్రిప్ట్ విషయంలో కానీ, బోల్డ్ సీన్స్ విషయంలో కానీ నేను ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి అలాంటి వార్తలను నమ్మకండి’ అంటూ ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. కియారా ఇచ్చిన ఈ క్లారిటీతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు కొంతవరకు చెక్ పడినట్లైంది. ఇటీవల ఆమెపై వచ్చిన విమర్శలకు ఇది గట్టి సమాధానంగా మారింది..!!
