in

samantha: Nobody took me to the hospital

హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ను హిందీలో రెండో సీజన్​గా హనీ బన్నీ పేరుతో పునర్మించారు. ఈ నవంబర్​ 7న అమెజాన్​ ప్రైమ్​ లో విడుదల కానుంది. ఇందులో సమంత కథానాయికగా నటించింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్​లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సామ్ భావోద్వేగాని కి లోనైంది. తనకు మయోసైటిస్ సోకినప్పుడు అదేంటో కూడా తెలియదని, దానికి చికిత్స ఎక్కడ దొరుకుతుందనే విషయం తెలియలేదని, ఒక్కసారిగా తాను గతం అంతా మర్చిపోయినట్లైందని,

మతిమరపు వచ్చినట్లై చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. ఆ సమయంలో తనను ఎవరూ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లలేదంటూ భావోద్వేగానికి గురైంది. మీరు ఎలా ఉన్నారు అని కనీసం ఎవరూ అడగలేదని, ఒక్కరు కూడా పలకరించలేదని వాపోయింది. తాను ‘సిటాడెల్’ సెట్స్ పైకి వచ్చేవరకు నిర్మాత, దర్శకులు ఎదురుచూసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. తాను చేయను అన్నప్పటికీ వారు పట్టుబట్టి చేయించారని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన సొంత బ్యానర్ లో ‘మాఇంటి బంగారం’ పేరుతో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది..!!

Rishab Shetty as Hanuman in Prasanth Varma’s ‘Jai HanuMan’!

KA Overall Review!