in

samantha is a trend setter : priyamani

వివాహం తర్వాత కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంతపై హీరోయిన్ ప్రియమణి ప్రశంసలు కురిపించింది. పెళ్లయినప్పటికీ సమంతకు ఫుల్ డిమాండ్ ఉందని, ఎంతోమందికి ఆమె ఆదర్శంగా నిలిచిందని ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. `నిశ్ఛితార్థం అయిందని తెలిస్తేనే ఒకప్పుడు హీరోయిన్‌కు అవకాశాలు తగ్గిపోయేవి.

కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మైండ్ సెట్ మారింది. దానికి సమంతే మంచి ఉదాహరణ. పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె తన శరీరాకృతి విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆమె ఫిజిక్ మెయింటెనెన్స్ అద్భుతం. నాకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి, ఓటీటీల నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయ`ని ప్రియమణి తెలిపింది.

adithi rao guest role in rakul’s movie!

28 years for roja!