in

samantha dosen’t want to be just an actress!

తాను కేవలం ఒక నటిగా మిగిలిపోవాలని కోరుకోలేదని, అంతకుమించి సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపాలని ఆకాంక్షించినట్లు సమంత తెలిపారు. ఒక నటిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అదృష్టంతో పాటు మరెన్నో అంశాలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. సమంత చేసిన ఈ తాత్విక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

గత కొంతకాలంగా సమంత కెరీర్ కాస్త నెమ్మదించిన విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడి కోలుకున్న తర్వాత, ఆమె మునుపటిలా వరుస చిత్రాలతో బిజీగా లేరు. ఇటీవల ‘శుభం’ అనే చిత్రంతో నిర్మాతగా మారి, అందులో అతిథి పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కినప్పటికీ, తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఓ తమిళ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారని వార్తలు వస్తున్నా, వాటిపై స్పష్టత రావాల్సి ఉంది..!!

happy birthday upendra!

reason Why Keerthy Suresh Not Rushing into Films now!