ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్..ఈ సినిమా పూర్తయిన వెంటనే శంకర్ సినిమాను పట్టాలెక్కించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.. కాగా, రామ్ చరణ్-శంకర్ల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియార అద్వానీతో పాటు ఓ కొరియన్ భామ కూడా ఎంపిక చేసినట్టు సమాచారం.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ టాక్ సినీ వర్గాల్లో నడుస్తోంది. రామ్ చరణ్-శంకర్ కాంభోలో వస్తున్న ఈ చిత్రంలో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉందనీ, ఆ పాత్రను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేయబోతున్నారనే క్రేజీ టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ- సల్మాన్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి సల్మాన్ ఈ చిత్రంలో నటించే అవకాశం అధికంగానే ఉంది. చూడాలి చిత్ర యూనిట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటించనుందో..!