సాయి పల్లవి గురించి తెలియని వారుండరు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఈ అమ్మడు దూసుకెళ్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల మేర పారితోషికం తీసుకుంటుంది. అయితే సాయి పల్లవి చెల్లెలు యమ స్పీడ్ లో ఉంది. తొందరలోనే పూజా కన్నను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది..
పండగ పూట తన బాయ్ ఫ్రెండ్ ను పూజా కన్నన్ పరిచయం చేయడంతో ఈ విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, ఒక వీడియోను పూజా కన్నన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్ధంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఎలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్. ఇప్పుడు నా పార్ట్నర్. ఐ లవ్ యు’ అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చింది సాయి పల్లవి చెల్లెలు..!!