లవ్ స్టోరీ” మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్న సాయి పల్లవి బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబ సభ్యులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సాయిపల్లవి సరదాగా అభిమానులతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. . ఎలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కామెడీ సినిమా చేయాలనుందని బదులిచ్చారు. సాయి పల్లవి మాట్లాడుతూ .. కామెడీ సినిమా చేయాలనే కోరిక చాలా రోజులుగా ఉందనీ,
వెండితెరపై అలాంటి పాత్రలో ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారో చూడాలనుందనీ , ప్రాపర్ కామెడీ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాననీ , షూటింగ్ లేకపోతే ఇంటికే పరిమితమవుతాననీ , విలాసాల కంటే ప్రకృతి ఒడిలో సేదతీరడమే తనకు ఇష్టమనీ , ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనివ్వడం ముఖ్యమనీ , .ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఒత్తిడి నుంచి దూరమవ్వడానికి ప్రయత్నిస్తాననీ చెప్పారు.