in

Prabhas wraps Adipurush shoot, fans in confusion!

వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. రామాయణం కథా వస్తువుగా ఇంతవరకూ వచ్చిన సినిమాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన చెప్పడం మరింతగా అంచనాలను పెంచింది. ఈ సినిమా కోసం ఇటు అయోధ్య .. అటు లంకానగరం .. మధ్యలో కిష్కింధ సెట్లు భారీస్థాయిలో వేయవలసి ఉంటుంది. వేల సంఖ్యలో కనిపించే వానర సైన్యానికి భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్ అవసరమవుతాయి. ఒక గడువులో .. ఒక నిడివిలో దీనిని పూర్తి చేయడం కష్టం. అందువలన ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పై నుంచి బయటికి రావడం కష్టమే అనుకున్నారు.

వచ్చే ఏడాది ఆగస్టు 11వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినా, అప్పటికి థియేటర్లకు రావడం అసాధ్యమేనని చెప్పుకున్నారు. కానీ ఓం రౌత్  ప్లానింగ్ మామూలుగా లేదు. ఆల్రెడీ కృతి సనన్ పోర్షన్  ను .. సైఫ్ అలీఖాన్ పోర్షన్ ను కానిచ్చేసిన ఆయన, నిన్నటితో ప్రభాస్ పోర్షన్ ను కూడా పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. ఇదంతా కూడా చాలా తక్కువ గ్యాప్ లో జరిగిపోవడం ఆశ్చర్యకరం. ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ పై నమ్మకం బలపడుతోంది. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

historical feat by trisha to receive UAE’s Golden Visa!

nabha natesh latest ismart photoshoot!