RC16 తరవాత సుకుమార్ తో ఒక మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు చెర్రీ. ఇది RC17 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2 ముగింపు కార్యక్రమాలు, ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఫ్రీ అయ్యాక చెర్రీ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తారని సమాచారం. అవన్నీ అయ్యేసరికి చెర్రీ బుచ్చి బాబు మూవీ కంప్లీట్ అవుతుంది.
అయితే ప్రజంట్ చెర్రీ గ్లోబల్ స్టార్ అయిపోవటంతో తనతో నటించే హీరోయిన్స్ పై కూడా అంతే శ్రద్ద తీసుకుంటున్నారు మేకర్స్. ఈ సారి చెర్రీ కోసం ఏ హీరోయిన్ ని దించుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. చెర్రీ క్రేజ్ కి కటౌట్ కి సాయి పల్లవి కూడా తోడయితే ఆ క్రేజ్ మరింత పెరుగుతుంది అని సుక్కు భావిస్తున్నారట. చెర్రీ, సాయి పల్లవి పెయిర్ చాలా బాగుంటుందని, డాన్స్ లో కూడా ఇద్దరి ఎవర్ గ్రీన్ అని ఫాన్స్ ఆశ పడుతున్నారు..!