in

Raveena Tandon’s daughte Rasha Thadani to romance balayya’s son?

సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధమైపోయింది. మోక్షజ్ఞ ఫస్టు లుక్ పోస్టర్ కూడా బయటికి వచ్చేసింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో విక్రమ్ తనయుడు ధృవ్ కనిపించనున్నాడనీ, హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రాషా తడాని టాలీవుడ్ కి పరిచయం కానున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇక్కడి ఫ్యాన్స్ ఈ బ్యూటీ గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు..

 గతంలో రవీనా టాండన్ తెలుగులోను రెండు ..మూడు సినిమాలు చేసింది. బాలయ్య బాబుతో ఆమె చేసిన ‘బంగారు బుల్లోడు’ అప్పట్లో పెద్ద హిట్టు. ఇప్పుడు ఆమె కూతురు బాలయ్య తనయుడి జోడీ కడుతుండటం విశేషం. రాషా తడానికి మార్షల్ ఆర్ట్స్ మంచి ప్రవేశం ఉంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్ గా పేరుంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. మంచి ఫిట్ నెస్ తో.. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంటూ ఉంటుంది. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమాను, వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట..!!

nani to team up with Malayalam hitmaker vipin das!

37 years for LADIES TAILOR!