in

Sai Pallavi To Play Allu Arjun’s Sister In Pushpa?

పుష్ప కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ సినిమాలో ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి నటించనుందని ఆ వార్త సారాంశం. అంతేకాదు ఇందులో సాయిపల్లవి బన్నీకి చెల్లెలిగా నటించనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమా కోసమే  చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించిదట ఈ నాచ్యురల్ బ్యూటీ.

ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉంది. ఇలాంటి సమయంలో ఒక యంగ్‌ హీరోకి చెల్లిగా నటించడానికి సాయి పల్లవి ఒప్పకుందంటే కాస్త సందేహించాల్సిందే. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ప్రస్తుతం ఈ నాచ్యురల్‌ బ్యూటీ  రానా సరసన ‘విరాటపర్వం 1992’ మూవీలో నటిస్తోంది.

director makes nidhi agarwal uncomfortable on stage!

anasuya sensational comments on tollywood producers!