in

sai pallavi is on cloud nine for getting ramayan sita offer!

టాలీవుడ్ హీరోయిన్లలో సాయిపల్లవి రూటే సపరేటు. ఈ బ్యూటీ మేకప్ వేసుకోదు.. ఎక్స్​పోజింగ్​ను దరిచేరనీయదు. ఏది పడితే ఆ సినిమాలు చేయదు. కంటెంట్ ఉండి.. తన పాత్ర బలంగా ఉంటే మాత్రమే సినిమాలు చేస్తుంది. అలాంటి పాత్రలు రాకపోతే ఎంచక్కా తన వైద్య వృత్తిపై ఫోకస్ పెడుతుంది. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న సాయిపల్లవికి బాలీవుడ్ పరిశ్రమ ఫిదా అయింది. అందుకే హిందీ చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో నటించే ఛాన్స్ ఇచ్చింది..

డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది సాయి పల్లవి. తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్​లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ విషయంపై స్పందించింది. డైరెక్టర్‌ తనలో సీతమ్మని చూశారనే ఫీలింగ్‌ చాలా బావుందని సంబురపడిపోయింది. నిజంగా ఇది అరుదుగా దొరికే అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘ఎప్పడెప్పుడు షూటింగ్‌కి పిలుస్తారా..అని ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. ఈ పాత్ర తనకో ఛాలెంజ్ అని..ఇప్పటికే ఈ పాత్రలో లెజెండ్రీ నటులు నటించారని..వారు చేసిన దాంట్లో 10 శాతం చేసినా తను సక్సెస్ అయినట్టేనని సాయి పల్లవి చెప్పింది..!!

item girl Urvashi Rautela lost her 24-carat gold iPhone?

here’s why directors and producers likes sreeleela!