సాయి పల్లవి.. తెలుగులో ఫిదా సినిమాలో నటించి అందర్ని ఫిదా చేసింది. అయితే ఈమె పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుదని.. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని.. తర్వాత సినిమాలు మానేస్తుందని ఇలా రకరకల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.
“త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు ఎక్కడ వుంటే అక్కడ వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను” అంటూ షాకింగ్ కామెంట్ చెప్పింది సాయి పల్లవి.