in

‘saaho’ beats ‘dangal’ record!

రోనా వైరస్ కారణంగా చాలా దేశాలు లాక్‌డౌన్ బాట పట్టాయి. దీంతో వినోద రంగం పూర్తిగా షట్‌డౌన్ అయింది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. జపాన్‌లో ఇటీవలె సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. అక్కడి ప్రజలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తున్నారు. ‘బాహుబలి’తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్‌లోనూ వీరాభిమానులను సంపాదించుకున్నాడు.

ప్రభాస్ నటించిన ‘సాహో’ జనవరిలో జపాన్‌లో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి విజృంభించడంతో అక్కడి థియేటర్లు మూతపడ్డాయి. థియేటర్లను తెరిచిన తర్వాత మరోసారి ఈ సినిమాను విడుదల చేశారు. తాజా రిపోర్టుల ప్రకారం జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా `సాహో` నిలిచింది. ఇంతకు ముందు ఆ రికార్డు ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ పేరిట ఉండేది..

ANASUYA Turning INTO A PRODUCER?

thapsee reacts on kangana’s b grade comments!