in

ANASUYA Turning INTO A PRODUCER?

తెలుగు టీవీ తెరపై తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది అనసూయ. అనసూయ కేవలం టీవీ తెరకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా, ఆ తర్వాత క్షణం, రామ్ చరణ్ రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలతో తనలోని నటి ఎలివేట్ అయింది. ప్రస్తుతం తెలుగు దర్శక, నిర్మాతలు అనసూయను దృష్టిలో పెట్టుకొని పలు స్టోరీలను రెడీ చేస్తున్నారట.

అంతేకాదు పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో కూడా ఈమె ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని పక్కన పెడితే అనసూయ త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టబోతుందని సమాచారం. దాంతో పాటు నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకోవాలని అనుకుంటుందట. సినిమాల పరంగా కాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఆమె నిర్మాతగా పలు వెబ్ సిరీస్‌లను నిర్మించే ఆలోచనలో అనసూయ ఉన్నట్టు సమాచారం.

SAMANTHA REVEALS HER GLAMOUR SECRET!

‘saaho’ beats ‘dangal’ record!