SVR గారు గొడవ పెట్టుకోవటంతో ” వెలుగు నీడలు” చిత్రంలో అవకాశం కోలుపోయిన అల్లు రామలింగయ్య గారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలో పెర్మనెంట్ ఆరిస్టులు ఎస్.వి.ఆర్, రేలంగి, సూర్యకాంతం. కానీ 1961 లో అన్నపూర్ణ నిర్మాణ సంస్థ ప్రారంభిచబోయే “వెలుగు నీడలు” చిత్రంలో ఎస్.వి.ఆర్. గారికి క్యారెక్టర్ లేదు అని తెలుసుకున్న ఎస్.వి.ఆర్. అన్నపూర్ణ సంస్థ ఆఫీస్ కు చేరుకొని నాకు క్యారెక్టర్ లేకుండా మీరు ఎలా సినిమా తీస్తారో చూస్తాను, సినిమా ఓపెనింగ్ రోజు నిరాహార దీక్ష చేస్తాను అంటూ గొడవ మొదలు పెట్టారు. గొడవ అంటే కోపం తో కాదు అన్నపూర్ణ సంస్థ తో ఆయనకు ఉన్న అనుబంధం అటువంటిది.
అందులో రంగ రావు గారు వేయదగ్గ పాత్ర ఏమి లేక పోవటం తో రేలంగి,అల్లు రామలింగయ్య గారిని తీసుకున్నారు, నిర్మాత, దర్శకుడు రంగా రావు గారిని ఎంత కన్వెన్స్ చేయాలనీ చూసిన అయన పట్టువీడలేదు,రంగా రావు గారి దెబ్బకు తట్టుకోలేక రేలంగి గారి కి అనుకున్న పాత్రకు ఎస్.వి.ఆర్. ని తీసుకున్నారు, అల్లు రామలింగయ్య గారికి అనుకున్న పాత్రకు రేలంగి గారిని తీసుకున్నారు, దాని పర్యవసానంగా అల్లు రామలింగయ్య గారు పాత్రను త్యాగం చేయవలసి వచ్చింది.” వెలుగు నీడలు” చిత్రంలో ఎస్.వి.ఆర్. గారు నటించిన రావు బహదూర్ వెంకటరామయ్య పాత్రకు చాల మంచి పేరు వచ్చింది.