in

Balakrishna and Chiranjeevi as cheif guests for RRR pre release event ?

ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా కోసం నందమూరి మెగా అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు. నందమూరి వర్సెస్ మెగా అభిమానులు అన్న తరహాలో ఒకప్పుడు వాతావరణం ఉండగా, అభిమానుల మధ్య సానుకూల వాతావరణం క్రియేట్ అయ్యే రీతిలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా విడుదల కోసం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున స్టార్ట్ కావడం తెలిసిందే. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా సల్మాన్ ఖాన్రావడం జరిగింది. భారీ ఎత్తున “RRR” ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే దాన్ని తలదన్నేలా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రమోషన్ కార్యక్రమం RRR మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. బాలయ్య బాబు, చిరంజీవి రాబోతున్నారు అట.

దీంతో ఒకే వేదికపై ఎన్టీఆర్, బాలయ్య బాబు చిరంజీవి వంటి స్టార్ పెద్ద హీరోలను కన్నుల విందుగా చూపించడానికి సినిమా మేకర్స్ ప్రమోషన్ ఏర్పాట్లు రెడీ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి ఏడవ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాహుబలి కంటే భారీ రేంజ్లో హిట్ అవ్వాలని సినిమాల్లో ప్రతి ఫ్రేం విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. మరి వచ్చే ఏడాది RRR ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

S.V.R GODAVA PETTUKOVADAMTHO CHARACTER POGOTTUKUNNA ALLU!

actress catherine tresa stills in mini skirt!