in

RUMORS cleared ABOUT ANUSHKA IN MAHESH BABU MOVIE!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారిపాట’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ , మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్స్ చూస్తుంటే మహేష్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నాడని అర్ధమవుతుంది. మొదటి నుంచి ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలు ఆధారంగా ఉండనుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. అయితే.. ఇటీవల ఈ సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. సర్కారు వారి పాటలో జేజెమ్మ అనుష్క నటించబోతుందని టాక్‌ వచ్చింది. ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ… సమాచారం మేరకు సర్కారు వారి పాటలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపించనుందని ఓ వార్త వైరల్‌ అయింది. అయితే.. దీనిపై క్లారిటీ వచ్చింది. ఆ వార్తలో నిజం లేదని.. ఈ మూవీలో అనుష్క నటిస్తుందన్న ప్రచారం అవాస్తవమని తేలింది. కాగా.. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ను హీరోయిన్‌గా నటించబోతుంది..

‘ARAVINDHA SAMETHA’ WILL ALWAYS BE SPECIAL FOR ME!

anil ravipudi wants to direct mahesh again!