in

‘rrr’ lo alia bhatt yela vacchi cherindhi!

రౌద్రం రణం రుధిరం”(R R R) చిత్రంలో అలియా భట్ హీరోయిన్ గ ఎలా ఎంపిక అయిందో తెలుసా? ఓ రోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో నిరీక్షిస్తున్న అలియా భట్ కు దూరంగా ఎదో కోలాహలం గ ఉండటం చూసింది, ఎవరో చెప్పారు,అదిగో ఆయనే బాహుబలి డైరెక్టర్ అని, అక్కడ తెల్ల గడ్డం తో ఉన్న ఒక వ్యక్తిని చూసింది.వెంటనే పరుగున అక్కడకు వెళ్లి జనాన్ని తోసుకొని రాజమౌళి దగ్గరకు వెళ్లి ” సర్ నేను మూవీ ఆర్టిస్ట్ ని నా పేరు అలియా భట్ మీ చిత్రంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి ఏ పాత్ర అయినా పరవాలేదు” అని గడ, గడ మాట్లాడేసింది . అది చుసిన రాజమౌళి ఒకింత ఆశ్చర్య పోయారు, తప్పకుండా ప్రయత్నిస్తాను అని చెప్పారు.

ఆలియా భట్ ఊరు పేరు లేని నటి కాదు, తన నటనతోస్మిత పాటిల్, షబానా అజ్మి కోవలో మెథడ్ యాక్టింగ్ చేస్తూ హిందీ చిత్రసీమలో అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణులలో ఆమె ఒకరు. ఆమె రాజమౌళి గారిని పాత్ర కోసం అడిగిన తీరు అయన మనసులో ముద్ర పడి పోయింది. అయన రౌద్రం రణం రుధిరం(R R R) చిత్రం లో ఆమెను పిలిచి అవకాశం ఇచ్చారు, దానికి తగినట్లుగానే షూటింగ్ ప్రారంభం అయిన తరువాత తెలుగు మాట్లాడటం నేర్చుకొని తన డైలాగ్స్ తానే చెప్పుకుంది.

Telugu heroine Harini Hot Photoshoot Stills!

actress tabu gives a warning to bollywood hero Karthik Aryan!