in

rowdy boy Vijay Deverakonda To Romance Bhagyashri Borse?

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకి ఇంకా టాలీవుడ్ డెబ్యూ రిలీజ్ కాకుండా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది.

ఇదిలా ఉండగా భాగ్యశ్రీ బోర్సేని మరో క్రేజీ ఆఫర్ వరించిందని లేటెస్ట్ అప్డేట్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ #VD12 లో విజయ్ దేవరకొండకు జోడిగా భాగ్యశ్రీ బోర్సేని లాక్ చేసుకున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ అగ్రిమెంట్ అయిపోయిందని తెలిసింది..!!

Gangs of Godavari!

happy birthday Ilaiyaraaja!