in

animal beauty Tripti Dimri special song in ‘Pushpa 2′?

ల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘పుష్ప 2’.. గతంలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది..

ఈ సినిమాలో మేకర్స్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. పుష్ప 3 కి సంబంధించి సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ‘యానిమల్‌’ చిత్రం బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్‌ ఈ పాటను కూడా షూట్‌ చేసే అవకాశం ఉంది..!!

happy birthday Ilaiyaraaja!

N.T.R SLAPPED HARI KRISHNA!