in

Regina hits the jackpot with Pan India level web series ‘rocket boys’!

డివి శేష్ తో ‘ఎవరు’ సినిమా తరువాత రెజీనా మరోసారి విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మడుకి అదిరిపోయే ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. తాజా అప్ డేట్ ప్రకారం.. ఓకే క్రేజీ వెబ్ సిరీస్ కి రెజీనా ఎంపికైందని తెలుస్తుంది. `రాకెట్ బోయ్స్` వెబ్ సిరీస్ లో కీలక పాత్రకు రెజీనా ఎంపికైంది.

రాకెట్ బోయ్స్ వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇదో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్. అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన  ఏపీజే అబ్దుల్ కలాం- విక్రమ్ సారాభాయ్- హోమీ బాబా లాంటి మేథావుల ఇతి వృత్తం ఆధారంగా  ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.బాలీవుడ్ లో రాయ్ కపూర్ ఫిల్మ్స్ అండ్ ఎమ్మీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా  ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో రెజీనా భాగమవ్వడం లక్కీ అనే చెప్పాలి..

anushka shetty’s decision worrying her producers!

Rajasekhar, Gopichand Combination Crazy Multistarrer!