in

Buchi Babu says Uppena 2 will be a pan world film!

ప్పెన సాధించిన విజయం చూశాక బుచ్చిబాబుపై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నుంచి ఉప్పెన-2పై హింట్‌ రావడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. దానికితోడు పాన్‌ వరల్డ్‌ సబ్జెక్‌ అవుతుంది అంటూ బుచ్చిబాబు హైప్‌ పెంచేస్తున్నాడు కూడా. ఉప్పెన సినిమాకి ముందే ఉప్పెన2 కథ రాసుకున్నట్లు బుచ్చిబాబు తెలిపాడు. ఈ ప్రపంచంలో మరే వ్యక్తి కూడా అలాంటి కథ రాయలేడంటూ బుచ్చిబాబు స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు. ఉప్పెనకు ముందే ఆ కథ రాస్తే దానిని ఎందుకు తెరకెక్కించలేదు అనే విషయంపై ఏ చెప్పలేదు. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుందనే విషయాన్ని అయితే చెప్పకనే చెప్పాడు. ఒక విభిన్న కథగా ఉప్పెనను తెరకెక్కించిన బుచ్చిబాబు. ఉప్పెన-2ను ఏ రేంజ్‌లో ప్లాన్‌ చేశాడో అని ఇప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

natyam!

saloni aswani stills in a wrap dress!