in

reason Why Sai Pallavi in ntr movie Talk Emerged!

న్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్…. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్‌ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అయితే.. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్ తో పాటు సాయిపల్లవి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. ఓ ప్రముఖ జాతీయ మీడియా కూడా ఈ  వార్త ప్రచురించింది.

అయితే..ఎప్పుడో సాయిపల్లవితో జరిగిన చర్చల గురించి ఇప్పుడు  రాసి ఉంటారని  దేవర మేకర్స్ ఆఫ్‌ ది రికార్డ్ క్లారిటీ ఇచ్చారట. దీంతో సాయిపల్లవి నటించడం లేదన్న విషయం స్పష్టమైంది. మరో విషయం ఏంటంటే..‘దేవర’లో ముందుగా సాయిపల్లవిని కాంటాక్ట్ చేశారట. అప్పుడామె ఇంట్రస్ట్ చూపించకపోవడం వలన జాన్వీ కపూర్ ను కాంటాక్ట్ చేశారట.  తెలుగు సినిమాల్లో నటించాలని జాన్వీ కపూర్ అనుకోవడం..సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో దేవర ప్రాజెక్ట్ రావడం.. అది కూడా ఎన్టీఆర్ తో మూవీ కావడంతో వెంటనే ఓకే చెప్పిందట..!!

spy!

happy birthday krishna bhagawan!