మాస్ మహారాజా రవితేజ లాస్ట్ బ్లాక్ బస్టర్ ఏదంటే గుర్తొచ్చేది ధమాకానే. రిలీజైన రెండు మూడు రోజులు టాక్ కొంచెం అటుఇటుగా వచ్చినా ఫైనల్ గా భారీ వసూళ్లతో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా శ్రీలీల గ్లామర్, డాన్సులు ఈ సినిమా సక్సెస్ లో ఎంత కీలక పాత్ర పోషించాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు..విచిత్రంగా ఆ తర్వాత రవితేజ, శ్రీలీల జంట విడివిడిగా చేసిన సినిమాలు కలిసి రాలేదు.
అందుకేనేమో ఈ పెయిర్ మరోసారి కనువిందు చేసేందుకు రెడీ అవుతోంది. సామజవరగమన రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించబోయే వినోదాత్మక చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా ఓకే అనుకున్నట్టు తెలిసింది. 2025 సంక్రాంతి విడుదలని ప్రాజెక్టు అనౌన్స్ మెంట్ టైంలో ప్రకటించేశారు..!!