in

Rashmika’s Words On Pushpa 2 Are Making Our Wait Harder!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 17న విడుదలై బంపర్ హిట్ అయింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా.. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించారు. సినిమా విడుదలై దాపుగా నెల కావొస్తున్నా.. ఇప్పటికీ పుష్ప రాజ్ ఫైర్ తగ్గనే లేదు. పుష్ప మొదటి పార్ట్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప రెండో భాగంపై ఉంది.

హీరోయిన్ రష్మిక తాజాగా ‘పుష్ప: ది రైజ్’ ​​సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. రెండో భాగంపై ఓ మాట ఇచ్చారు. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో సీక్వెల్ మరింత బెటర్‌గా ఉంటుందని ప్రామిస్ చేశారు. సినిమా పట్ల అందరూ కురిపించిన ప్రేమ తమను మరింత కష్టపడేలా చేస్తుందని పేర్కొన్నారు. ‘పుష్ప సినిమా పట్ల మీరు చూపిన ఆదరణ, ప్రేమకు ధన్యవాదాలు. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము. పుష్ప 2 మరింత బిగ్గర్‌గా, బెటర్‌గా ఉంటుంది’ అని రష్మిక ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేశారు.

Telugu Actress Surabhi Stills in short white dress!

power star’s alludu signs his next with ‘bheemla nayak’ makers!