in

power star’s alludu signs his next with ‘bheemla nayak’ makers!

మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తమ మార్క్ ను చూపించాడు వైష్ణవ్ తేజ్. నిజానికి మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే అంత పోటీ వాతావరణంలో కూడా మొదటి సినిమాతోనే తన కుంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ అందులో సక్సెస్ అయ్యాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమా తరువాత కొండపొలం సినిమా చేయగా ఆ సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఇక వైష్ణవ్ తేజ్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక నేడు వైష్ణవ్ తేజ్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. భీమ్లానాయక్ మేకర్స్ తో వైష్ణవ్ తేజ్ సినిమా ఛాన్స్ ను కొట్టేశాడు. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు అధికారికంగా ప్రకటించారు. తమ బ్యానర్ లో వస్తున్న 16వ సినిమా అని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి ఈసినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

Rashmika’s Words On Pushpa 2 Are Making Our Wait Harder!

Thamanna Bhatia at Golden Rose Awards!