చేసినవి కొన్ని సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది రశ్మిక మందన్న.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చీ ఇండస్ట్రీని ఏలుతుంది.ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు.ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తున్న సందర్భంగా ఇంటికే పరిమితమైన రష్మిక సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చింది.
అభిమానులు అడిన ప్రశ్నలకు చిలిపి సమాధానాలు చెప్పింది. శారుఖ్, కాజల్ తరహాలో నాతో డేటింగ్ చేస్తారా అని అడిగితే తనని కొంచెం ఆలోచించుకునే అవకాశం ఇమ్మని రిప్లై ఇచ్చింది. దేవుడు ఎదురైతే నీకు భర్తని చేయమని అడుగుతానని ఓ అభిమాని అతిగా ఆశపడితే రష్మిక నుంచి దిమ్మదిరిగే రిప్లై వచ్చింది. తన పెళ్లి గురించి అడగాలంటే ముందు తన పెంపుడు కుక్కని అడగాలని సమాధానం చెప్పడంతో సదరు అభిమాని షాకయ్యాడు.