in

rashmika responds to trolls about her character role!

యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో అభిమానుల్ని మెప్పించింది రష్మిక. విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో కర్వాచౌత్‌ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమె విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆమెపై వస్తోన్న ట్రోల్స్‌ గురించి స్పందిస్తూ… ‘యానిమల్‌’లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ చెప్పే విధానం బాగాలేదని విమర్శిస్తున్నారు. అందులో కర్వాచౌత్‌ సన్నివేశం గురించి ఎక్కువ ట్రోల్స్‌ చేస్తున్నారు.

కానీ.. ఆ సన్నివేశం ఈ సినిమాకే ప్రత్యేకం. ఒక్క సీన్‌లోనే ఎన్నోరకాల హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. దానికోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అందులో నా నటన చూసి సెట్లో, థియేటర్లలో మంచి ప్రశంసలు వచ్చాయి. విచిత్రమేంటంటే..9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్‌ బాగాలేదని నన్ను ట్రోల్స్‌ చేశారు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అయినా ఎవరి అభిరుచి వాళ్లది. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా‘ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక..!!!

guntur kaaram girl gets a chance to romance venkatesh!

allu arjun’s daughter in ntr’s devara!