రష్మిక అంటే ఎంత క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఎలాంటి అల్లరి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేశారు. సిద్దార్థ్ మల్హోత్రతో ఓ సినిమా చేస్తున్నారు. అంత కంటే ముందుగానే ఉత్తరాది ప్రేక్షకులను ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకున్నారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అయితే రష్మిక స్టేజ్ ఎక్కితే అందరినీ ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలు, హావభావాలతో అందరినీ కట్టిపడేస్తుంటారు.
మొన్న చెన్నైలో జరిగిన ‘సుల్తాన్’ ఈవెంట్‌లోనూ రష్మిక దంచి కొట్టేశారు. తమిళం అంతా రాకపోయినా కూడా స్టేజ్ మీద అడిగి మరీ మాట్లాడేశారు. కార్తీకి స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేశారు. తమిళంలో కష్టపడి ఎంతో ఇష్టంగా తమిళ అభిమానుల కోసం మాట్లాడేశారు.నిన్న హైద్రాబాద్‌లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక తన సత్తా చాటారు. ముంబైలో బిజీగా ఉన్నా.. షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం అర్జెంట్‌గా వచ్చేశారు. అలా త్వరగా మాట్లాడేసి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ముందుగానే మైక్ అందుకున్నారు. కానీ రష్మిక ముద్దు చేష్టలకు అభిమానులు గోల గోల చేశారు.