
నేషనల్ క్రష్ రష్మికా మందన్నకు బాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియాలో కూడా ఈ తెలుగింటి కోడలు తన జోరు కొనసాగిస్తోంది. ‘పుష్ప’ సిరీస్, ‘యానిమల్’, ‘ఛావా’ విజయాలతో ఆమె క్రేజ్ ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ విపరీతంగా పెరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… రష్మిక క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఆమె కెరీర్లో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారట షాహిద్ కపూర్ టీమ్. దాంతో రష్మిక సరికొత్త రికార్డు సృష్టించింది..
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘కాక్ టెయిల్’కు సీక్వెల్గా వస్తున్న సినిమా ‘కాక్ టెయిల్ 2’ లో రష్మిక ఓ హీరోయిన్. కృతి సనన్ మరొక హీరోయిన్. ఈ సినిమా కోసం రష్మికకు దాదాపు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు బాలీవుడ్ టాక్. రష్మికా మందన్న కెరీర్లో ఇప్పటి వరకు తీసుకున్న హయ్యస్ట్ రెమ్యూనరేషన్ 15 కోట్లు మాత్రమే. దీనికి ముందు 12 కోట్ల రూపాయలు తీసుకున్నారట. అయితే..హిందీ చిత్రసీమతో పాటు తెలుగులోనూ ఆమెకు ఉన్న పాపులారిటీ కారణంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట షాహిద్ కపూర్ ‘కాక్ టెయిల్ 2’ టీమ్..!!
