in

Vijay Sethupathi and director Puri Jagannadh combo on cards

పూరి కాంపౌండ్ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు రివీల్ అయింది. లైగ‌ర్, డబ్బులు ఇస్మార్ట్ సినిమాల భారీ డిజాస్టర్ల తర్వాత తర్వాత పూరి నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు ఊహించని హీరోతో సినిమాకు పూరి సిద్ధమవుతున్నాడు అంటూ టాక్‌ నడుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇటీవల ఆయనను కలిసిన పూరి జగన్నాథ్..

స్టోరీని వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడట. అంతేకాదు..ఆయన చెప్పిన స్టోరీ సింగిల్ సిట్టింగ్‌లోనే విజయ్ సేతుపతి ఓకే చేసేసారని..తను చేసే సినిమాల కథలన్నీ పక్కనపెట్టి కాల్‌షీట్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటూ సమాచారం. ఇక విజయ్ సేతుపతితో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడని..సినీవర్గల‌లో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. రెగ్యులర్ డ్రగ్స్ నేపథ్యంలో కాకుండా.. క్రైమ్ తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ని రూపొందించనున్నట్లు సమాచారం.

Tamannaah Bhatia Drops a Cryptic Note!

rashmika mandanna opts to do special songs in bollywood?