in

Rashmika Mandanna may play MS Subbulakshmi in upcoming biopic!

ర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా ఓ భారీ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు గ్రహీత, ‘జెర్సీ’ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లు తెలుస్తోంది. ఈ అరుదైన అవకాశం ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నను వరించినట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం, ఇటీవల చిత్రబృందం రష్మికపై రహస్యంగా ఒక లుక్ టెస్ట్ నిర్వహించింది. సాంప్రదాయ గెటప్‌లో రష్మిక అద్భుతంగా సరిపోయిందని, ఆమె హావభావాలు చూసి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. దీంతో ఈ పాత్రకు ఆమెను దాదాపు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..!

happy birthday balakrishna!

Janhvi Kapoor in talks with Tumbbad director Rahi Anil Barve!