
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె మరో ఆసక్తికర చిత్రానికి అంగీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కల్ట్ క్లాసిక్ హారర్ ఫిల్మ్ ‘తుంబాడ్’ ఫేమ్ దర్శకుడు రాహి అనిల్ బర్వే దర్శకత్వంలో ఓ భారీ క్రీచర్ హారర్ చిత్రంలో నటించేందుకు జాన్వీ చర్చలు జరుపుతున్నట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది..
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని సమాచారం. అంతా సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివర్లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘తుంబాడ్’ తర్వాత రాహి అనిల్ బర్వే హారర్ జోనర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా అనగానే ప్రేక్షకుల్లోను, పరిశ్రమలోను ఆసక్తి నెలకొంది..!!

