పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా యువతకు క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. ఈ కన్నడ భామ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బిజీగా ఉంటోంది. వివిధ ప్రాజెక్టులకు ఓకే చేస్తూ సాటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిరుచులను వెల్లడించడంతో పాటు, తాను చేస్తున్న సినిమాల గురించి ఆమె ముచ్చటించింది. అందులో తనకు తమిళ స్టార్ హీరో విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని పేర్కొంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా తనను ఎంపిక చేశారని తెలియగానే ఎగిరి గంతేసినట్లు రష్మిక చెప్పింది. సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన తర్వాత తొలిసారి తన అభిమాన హీరో విజయ్‌ను కలిసిన క్షణాలను తాను మర్చిపోలేనని తెలిపింది. పూజా కార్యక్రమం సమయంలో హీరో విజయ్‌ను చూస్తూ అలాగే ఉండిపోయానని, పూజ పూర్తైన తర్వాత తానే స్వయంగా ఆయనకు దిష్టి తీశానని పేర్కొంది. తన అభిమానాన్ని చూసి సెట్‌లో ఉన్నవారంతా గట్టిగా నవ్వారని గుర్తు చేసుకుంది.