in

dimple hayathi gets her 3rd chance with telugu hero!

డింపుల్ హయాతీ తక్కువ సినిమాల్లోనే నటించినప్పటికీ తన అందం, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘రామబాణం’ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమె ఇటీవల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, డింపుల్‌కు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో నటిస్తున్న డింపుల్ హయాతీకి మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న హారర్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా డింపుల్ హయాతీని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌తో రవితేజ సరసన డింపుల్ హయాతీ నటించడం మూడోసారి కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఖిలాడి, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాల్లో డింపుల్ తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం వరుస ఫ్లాప్‌ల తర్వాత డింపుల్‌కు ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రవితేజతో గతంలో చేసిన రెండు సినిమాలు విజయవంతం కాకపోవడంతో, ఈసారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..!!

happy birthday sonu sood!

shivangi joshi was allegedly abused as a child!