in

rashmika as Guest Editor for upasana’s ‘urlife’!

పాసన ఇటీవలే ఆమె ‘URLife’ అనే ఆల్ ఇన్ వన్ వెల్‌నెస్ ప్లాట్‌ఫాంను స్థాపించారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ప్రజలకు ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య చిట్కాలు, పౌష్టికాహారం తయారు చేసుకోవడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మానసిక, భావోద్వేగాల సమతుల్యత లాంటి తాను గాఢంగా నమ్మే కొన్ని సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేశామని ఉపాసన తెలిపింది.

అయితే ఉపాసన ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరించిన సంగతి తెలిసిందే. ‘యువర్ లైఫ్’ వెబ్ పోర్టల్‌ ద్వారా కొత్త కొత్త రెసిపీలను వ్యూయర్స్‌కు పరిచయం చేస్తున్నారు. ‘స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్’ సెక్షన్‌లో హెల్దీ అండ్ టేస్టీ వంటలతో ఆమె మంచి చెఫ్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు అదే జాబితాలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న గెస్ట్ ఎడిటర్ గా కనిపించనున్నారు.

Rana Daggubati film with Black Magic!

BELLAMKONDA BOLLYWOOD DEBUT WITH CHATRAPATHI REMAKE?