in

Sreeleela recalls balancing MBBS exams with song shoot!

శ్రీలీల తన సినీ కెరీర్‌తో పాటు వైద్య విద్యను ఎలా కొనసాగించిందో వెల్లడించింది. ‘డాక్టర్స్ డే’ సందర్భంగా మాట్లాడుతూ ‘వైరల్ వయ్యారి’ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఎంబీబీఎస్ పరీక్షలకు ప్రాధాన్యం ఇచ్చానని తెలిపింది. ‘‘డాక్టర్ కావడం నా చిన్ననాటి కల. అదే నా అతిపెద్ద అభిరుచి. ‘వైరల్ వయ్యారి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా నా ఎంబీబీఎస్ పరీక్షలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను..

షూటింగ్ పూర్తయ్యాక వెంటనే ప్రాక్టికల్స్‌కు వెళ్లేదాన్ని. మధ్యలో విరామం దొరికితే మళ్లీ సెట్స్‌కు వచ్చి షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఇది అంత సులభం కాదు. కానీ వైద్య విద్య నాకు ఎంతో విలువైనది’’ అని శ్రీలీల చెప్పింది.
‘వైరల్ వయ్యారి’ పాట ‘జూనియర్’ సినిమాలోనిది. ఈ చిత్రంలో కీరీటి రెడ్డి హీరోగా నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందించారు. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మించారు. ప్రస్తుతం శ్రీలీల పలు భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది..!!

happy birthday krishna bhagawan!

Pooja Hegde joining Pawan Kalyan’s ‘OG 2’ or not?