in

ranveer singh wants to act under ss rajamouli’s direction!

రాజమౌళి తో వర్క్  చేసేందుకు అన్ని ఇండస్ట్రీలకి చెందిన నటీ నటులు ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో రణవీర్ సింగ్ కూడా తన మనసులో మాట బయట పెట్టాడు. రణవీర్ సింగ్ బాలీవుడ్లో విభిన్న ప్రాజెక్ట్ లు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు . సంజయ్ లీలా బన్సాలి లాంటి క్రియేటివ్ దర్శకుడితో వరుసగా మూడు సినిమాలకి వర్క్ చేశాడు. అవన్నీ కూడా భారీ హిట్స్. రణవీర్ అద్భుతమైన నటుడు ఎలాంటి క్యారక్టర్ అయినా పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు.

రణవీర్ సింగ్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకి రాజమౌలి సినిమాలో నటించాలని ఉందని, తన సినీజీవితం మొత్తంలో ఒక్క సారైనా జక్కన్నతో వర్క్ చేస్తానని ప్రతిన బూనాడు. దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. రాజమౌళి సినిమాలో హీరోకి ఉండాల్సిన లక్షణాలు రణవీర్ కి పుష్కలంగా ఉన్నాయి. మరి వీరి కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి..!!

HAPPY BIRTHDAY S JANAKI!

Kiara Advani to be part of Prabhas’ salaar 2?