ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ స్టార్ ను దింపుతున్న కొరటాల శివ
దేవర 2 కి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ కొరటాల శివ నార్త్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని.. అక్కడ నుండి మరో హీరోని ఈ సినిమా లో తీసుకుంటున్నాడని తెలుస్తుంది.. అందులో భాగంగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేసాడు. కథలో అసలు మలుపు పార్ట్ 2 లోనే ఉండబోతుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 లోనే చాలా మార్పులు చేస్తున్నారని తెలుస్తుంది..
జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 లో రణ్వీర్ సింగ్
దీంతో అభిమానుల అంచనాలు ఈ సినిమా పై రెట్టింపయ్యాయి..ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ మూవీలో కూడా నటిస్తున్నాడు. కాబట్టి వచ్చే సంవత్సరం జనవరి లో ఈ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు..!!