in

Rana To Host Bigg Boss Telugu Season 5 Replacing Nagarjuna?

సీజన్ 3, 4లకు టాలీవుడ్ మన్మధుడు..కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. రెండు సీజన్స్ సూపర్ రేటింగ్ తో సక్సెస్ ఫుల్ గా సాగాయి. ఇక ఎప్పటిలాగే సెప్టెంబర్ నుంచి సీజన్ 5 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్నా, మొన్నటి వరకు నాగార్జుననే బిగ్ బాస్ 5 కి హోస్ట్ గా వ్యవహరించనున్నారని వార్తలు వచ్చాయి. దాదాపు అందరూ ఫిక్సయ్యారు కూడా..కానీ తాజాగా రానా దగ్గుబాటి పేరు వినిపిస్తోంది. ఈసారి రానా బిగ్ బాస్ 5కి హోస్ట్ గా ఫైనల్ అయ్యాడట.

ఇది ఎంతవరకు నిజమో చూడాలి. రానా దగ్గుబాటి ఇప్పటికే నంబర్ వన్ యారి కి హోస్ట్ గా వ్యవహిస్తున్నాడు. ఈ సీజన్ ని రానా చక్కగా నడిపిస్తున్నాడు. దాంతో బిగ్ బాస్ 5 రానా చేతికి వచ్చిందట. ఇక ఈసారి రెండు రియాలిటీ షోలు ఒకేసారి ప్రసారం అయ్యే అవకాశం ఉందని సమాచారం. జూనియర్ ఎన్.టి.ఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పటికే ఛానల్ నిర్వాహకులు అఫీషియల్‌గా ప్రకటించి ప్రోమో కూడా వదిలారు. ఈపాటికే మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా సెప్టెంబర్ నుంచి టెలికాస్ట్ ప్లాన్ చేస్తున్నారట.

sadha shocking comments on balayya and jr ntr!

rathalu to do special item song in ‘akhanda’!