in

Rana Daggubati wants to act in superhero film!

బాహుబలి చిత్రంలో భల్లాల దేవుడి పాత్రతో రానా నేషనల్ వైడ్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఘాజి చిత్రం కూడా రానా క్రేజ్ ని పెంచింది. చాలా రోజుల తర్వాత రానా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు..ఈ ఇంటర్వ్యూలలో రానా తన ఫ్యూచర్ ప్లాన్స్ వివరించాడు. ఇందులో రానా అభిమానులు థ్రిల్ ఫీలయ్యే న్యూస్ కూడా ఉంది. త్వరలో రానా సూపర్ హీరోగా నటించబోతున్నాడు. స్వయంగా రానానే ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవరు? ఎలాంటి సూపర్ హీరో చిత్రం ?

నటీనటులు ఎవరు ? లాంటి విషయాలని రానా రివీల్ చేయలేదు. రానా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో థానోస్ పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ త్వరలో రానా సూపర్ హీరోగా కనిపించబోతున్నది మాత్రం ఖాయం. తనకు యాక్షన్ మూవీస్, మైథాలజీ కథలంటే కూడా చాలా ఇష్టం అని రానా రివీల్ చేశాడు. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే ఉంటానని రానా తెలిపాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రానా పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యపు’లో నటించాల్సి ఉంది. ఈ చిత్రానికి తెరవెనుక కొన్నేళ్లుగా సన్నాహకాలు జరుగుతున్నాయి..

Sarpatta Parampara!

ruhani sharma’s heart melting photoshoot stills!