in

Rana Daggubati launches Samyuktha Menon’s new-age thriller!

భీమ్లా నాయక్‌’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌, నిత్యా విూనన్‌ ఒక జంటగా నటిస్తే..మరో జంటగా రానా దగ్గుబాటి, సంయుక్త నటించారు. ఈ సినిమాలో నిత్యావిూనన్‌ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత సంయుక్త పాత్రకు కూడా ఉంటుంది. ఆ పాత్రలు వారిద్దరికీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి..

ఇక ఇప్పటి వరకు హీరోల పక్కన నటిస్తూ సక్సెస్‌ అందుకుంటున్న సంయుక్త తొలిసారి ఫిమేల్‌ సెంట్రిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా..ఈ సినిమాకు క్లాప్‌ను ‘భీమ్లా నాయక్‌’లో తనకు భర్తగా నటించిన రానా దగ్గుబాటి కొట్టారు. ఈ సినిమా వరుస బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్‌ లక్కీ చార్మ్‌ సంయుక్త తొలిసారిగా ఫీమేల్‌ సెంట్రిక్‌ మూవీ చేస్తున్నారు..!!

poonam kaur sensational comments on director!

Telugu films with same movie titles!