in

rana confirms multi starrer with venkatesh!

ప్పటి నుంచో విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఒకటి ఉంది. వెంకటేష్, రానా కలిసి చేయబోయే సినిమా అది. ఇప్పటి వరకు ఆ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ అయిందట. ఈ విషయాన్ని రానానే స్వయంగా వెల్లడించాడు. ఈ కరోనా హడావుడి అంతా ముగిసిన తరువాత వెంకీ, రానా సినిమా ప్రకటన వస్తుందట. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదే ఉంటుందని చెప్పారు. ఇక గతంలో కథలు వినడానికి టైమ్ దొరికేది కాదని… ఇప్పుడు కరోనా కారణంగా టైమ్ దొరికిందని రానా చెప్పాడు. అలా దొరికిన కథల్లో బాబాయ్, -అబ్బాయ్‌ల కథ ఒకటి అని అన్నాడు. ఆ కథను పాలిష్ చేసి అంతా సిద్ధం చేశామని చెప్పాడు. అయితే ఈ కథ ఎవరు చెప్పారు? డైరక్టర్ ఎవరు? అన్నది రానా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామన్నాడు.

thamanna faced the thought of death!

Ram Charan gains a record 1 Million Twitter followers!