in

ram pothineni controversial tweet on caste!

హీరో రామ్ ఇటీవల ఉహించని విధంగా ఏపీ ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పోలీసులు ఘాటుగా స్పందించారు. అయితే విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని పోలీసులు తెలిపారు. ఈ విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులు జారీ చేస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పడంతో విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది..ఇక ఈ పరిణామాల నడుమ విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ ఘటన గురించి ఇకపై తాను ఎలాంటి సందేశాలు చేయబోనని రామ్ ప్రకటించారు.

అయితే తన అంకుల్ కావడం వల్లనే రమేష్ హాస్పిటల్ ఛైర్మన్ అయిన డాక్టర్ రమేష్ బాబును రామ్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడని కొందరు ఆయనపై కుల ముద్ర వేస్తూ కామెంట్స్ చేయడం, లైవ్‌లో పలు ఆరోపణలు చేయడంతో మరోసారి రంగంలోకి దిగి తాజాగా ‘కులం’ గురించి ప్రస్తావిస్తూ సంచలన సందేశం పంపారు రామ్. రామ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.. కులం అని పిలవబడే వ్యాధి కరోనా కంటే వేగంగా వ్యాపి చెంది త్వరగా అంటుకుంటుందని అన్నారు. ఇది కరోనా కంటే డేంజరస్ అన్నారు. ఈ వ్యాధిని సైలెంట్‌గా వ్యాపింపజేసేవాళ్లు.. మిమ్మల్ని కూడా అందులోకి లాగడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త అని అన్నారు.

surekha vani frustrated about linkup rumors!

brathiki undagane SHAKALAKA SHANKAR photo ki dhanda vesi bhojanalu pettaru!