RC16 లో చరణ్ పాత్రకు ఇప్పటిదాకా చేయని మేకోవర్ అవసరం. ముఖ్యంగా శారీరకంగా కఠినమైన మార్పులు కావాలట. దీని కోసమే రామ్ చరణ్ త్వరలో ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నట్టు తెలిసింది. రెండు నెలల పాటు ప్రత్యేకంగా ఒక ట్రైనర్ సమక్షంలో శిక్షణ తీసుకుని తిరిగి రాబోతున్నట్టు తెలిసింది. గతంలో ఆర్ఆర్ఆర్ కోసం ఇదే తరహా కష్టం పడినప్పటికీ ఈసారి అంతకు రెండు మూడింతలు ఉంటుందట.
స్పోర్ట్స్ టచ్ ఉన్న బ్యాక్ డ్రాప్ కావడంతో చరణ్ దృఢత్వం మీద పలు ఎపిసోడ్లు ఆధారపడి ఉంటయని తెలిసింది. మహారాజా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో ఈ స్టోరీ తనకు తెలుసని, సూపర్ డూపర్ హిట్ ఖాయమని బుచ్చి బాబుతోనే అన్న మాటలు వైరలవుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా శివరాజ్ కుమార్ ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆర్సి 16 క్యాస్టింగ్ కు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది..!!