in

Ram Charan to step forward into production for Akhil Akkineni

జెంట్ డిజాస్టర్ తో బాగా డిస్టర్బ్ అయిన అఖిల్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చాక మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. ఇంత కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ కావడం ఒక ఎత్తయితే అక్కినేని అభిమానుల్లో నిరాశ రెట్టింపు కావడం అసలైన బాధ. కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్లవుతున్నా ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదన్న ఆక్రోశం అఖిల్ లో విపరీతంగా ఉంది. ఇప్పుడది తీర్చే బాధ్యతను రామ్ చరణ్ తీసుకోబోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ విక్రమ్(యువి భాగస్వామి) తో కలిసి మొదలుపెట్టబోయే వి మెగా బ్యానర్ ఫస్ట్ వెంచర్ గా అఖిల్ మూవీనే ఉండబోతోందట..

ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అఖిల్ మీద చరణ్ కు చాలా అఫెక్షన్ ఉంది. అందుకే ఏజెంట్ ప్రమోషన్ కోసం రామ్ చరణ్ షల్ ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్ బిట్ లో ధృవ గెటప్ లో నటించాడు. ఇంతకు ముందు ఇలా ఎవరికీ చేయలేదు. పలు ఇంటర్వ్యూలలో అఖిల్ కూడా అన్నయ్య లాగా మెగా పవర్ స్టార్ నుంచి ఎలాంటి గైడెన్స్ తీసుకుంటానో చెప్పాడు. ఈసారి కథ ఎంపిక, దర్శకుడిని గైడ్ చేయడం వగైరా వ్యవహారాలన్నీ అఖిల్ చూసుకోడట. మొత్తం చరణ్ పర్యవేక్షణలో విక్రమ్ టీమ్ జాగ్రత్తలు తీసుకుని అన్నీ సెట్ చేయబోతోంది…!!

Dimple hayathi fears for her life, says lawyer!

happy birthday sr ntr!