in

Ram Charan to reunite with ‘Pushpa’ director Sukumar!

RRR త‌ర్వాత గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చ‌ర‌ణ్‌, ఇటు ‘పుష్ప’ సినిమాతో త‌గ్గేదేలే అంటూ అంద‌రివాడ‌నిపించుకున్నారు సుకుమార్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద మ‌న ద‌గ్గ‌రే కాదు, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. 2025 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు.

రామ్‌చ‌ర‌ణ్‌ – సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌కి దేవిశ్రీ ప్ర‌సాద్ పేరు తోడ‌వ‌డం అభిమానుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచేస్తోంది. ‘రంగ‌స్థ‌లం’ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ కాంబినేష‌న్ మ‌రోసారి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో రెడీ అవుతోంది. ఇంత‌మంది హేమాహేమీలు క‌లిసి రూపొందిస్తున్న ఈ సినిమా, ప్యాన్ ఇండియా సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ని నెవ‌ర్ బిఫోర్ అన్న‌ట్టు క‌లిగించ‌నుంది. సో..గెట్ రెడీ!

HAPPY BIRTHDAY PRAKASH RAJ!

Akshay Kumar In Prabhas – Sandeep Reddy Vanga’s Spirit?