in

Ram charan picked Bollywood’s hot babe for RC16?

రణ్ 15వ సినిమాగా శంకర్ మూవీ రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ నెల జూన్ కి షూటింగును పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు. కానీ అనుకోకుండా ‘ఇండియన్ 2’ సినిమాకి లైన్ క్లియర్ కావడంతో అటువైపు వెళ్లిపోయాడు. ఒక ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగు వాయిదా పడినట్టేనని అంటున్నారు.  ఈ లోగా ఎవరికి వారు ఆ తరువాత చేయవలసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. చరణ్ తన తదుపరి సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సంగతి తెలిసిందే.

ఆ సినిమాను ముందుకు జరుపుతున్నట్టుగా సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, శంకర్ వచ్చే లోగా పూర్తిచేయాలని గౌతమ్ తో చరణ్ చెప్పాడట. దాంతో ఆ దిశగా సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. కథానాయికగా దిశా పటాని పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఆమె పేరే ఖరారు కావొచ్చని అంటున్నారు. ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇదేకావడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ‘అంతిమ్’ స్పెషల్ స్క్రీనింగ్  హాజరైన దిశాపటాని చూసి అందరు షాక్ అయ్యారు. అమ్మడి లుక్ ఎదో తెగ కొట్టినట్టు కనిపిస్తుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తన ముక్కుకు ..పెదాలకు ఆమె సర్జరీ చేయించుకున్నట్టుగా భావిస్తున్నారు.సర్జరీ విక‌టించ‌డంతో ఆమె ముఖం కాస్త మారిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతోంది..ఈ ఫొటోల్లో ఆమెను చూసిన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో కొత్త టాక్ వినిపిస్తుంది. ఇక పై ఈ అమ్మడికి సినిమా అవకాశాలు తగ్గనున్నాయని అంటున్నారు. సర్జరీ తర్వాత దిశను చూసిన కొందరు దర్శక నిర్మాతలు మనసు మార్చుకుంటున్నారట. కొంతమంది దర్శకులు తమ రాబోయే సినిమాలకు ఈ అమ్మడు వద్దు అని అనుకుంటున్నారట.  దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

‘master’ beauty Malavika Mohanan at IIFA Green Carpet!

chay and sam spotted in same location, avoids eye contact!