అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసిన రామ్ చరణ్
ఇద్దరూ బంధువులే అయినప్పటికీ..కొన్ని రోజులుగా రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మెగా, అల్లు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చను లేవనెత్తింది.
అల్లు vs మెగా, బన్నీ ను ఇంస్టాగ్రామ్ అన్ ఫాలో చేసిన చరణ్
అల్లు అర్జున్ గత ఎన్నికల్లో జనసేన పార్టీ ను కాదని వైసీపీ పార్టీ అభ్యర్థి కు సపోర్ట్ చేయడంతో అప్పటినుండి అల్లు, మెగా ఫ్యామిలీ కు గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ ఎక్కడ మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో గాని పవన్ కళ్యాణ్ తో కానీ కనిపించలేదు, ఇందుకోసమే ఇప్పుడు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా అల్లు అర్జున్ ను దూరం పెట్టి ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసాడని టాక్..మరి దీనికి అసలు కారణం ఇదేనా అని క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సిఉంది..!!